రామ్ చరణ్ సినిమాకి చిరంజీవి క్లాప్

రామ్ చరణ్ సినిమాకి చిరంజీవి క్లాప్

Published on May 29, 2013 6:01 PM IST

chiranjeevi_son_ramcharan_t

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే ‘మిర్చి’ సినిమాతో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ ఓ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా ముహూర్త కార్యక్రమం ఈ శుక్రవారం ఉదయం 9 గంటలకు బండ్ల గణేష్ ఆఫీసులో జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసి మొదటి సీన్ కి క్లాప్ ఇవ్వనున్నారు. చిరుతో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆశిస్తున్నారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బండ్ల గణేష్ నిర్మించిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఆ రోజే విడుదల కానుంది.

తాజా వార్తలు