ఇద్దరమ్మాయిలతో టికెట్స్ కి ఫుల్ డిమాండ్

ఇద్దరమ్మాయిలతో టికెట్స్ కి ఫుల్ డిమాండ్

Published on May 29, 2013 11:47 AM IST

Iddarammayilatho advance booking

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మల్టీ ప్లెక్సుల్లో ఈ సినిమా టికెట్స్ కోసం బుకింగ్ మొదలైంది. ఈ సినిమా టికెట్స్ ఫుల్ డిమాండ్ ఉండడంతో బుకింగ్ మొదలు పెట్టిన కొద్ది సేపటికే ప్రసాద్ మల్టీ ప్లెక్సులో మొదటి రోజు టికెట్స్ అమ్ముడు పోయాయి.

ఈ సమ్మర్లో తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాల్లేక బిగ్ బడ్జెట్ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన అమలా పాల్, కేథరిన్ లు జోడీ కట్టారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు