ఎన్టీఆర్‌కు భారతరత్న తప్పకుండా వస్తుంది – బాలకృష్ణ

ఎన్టీఆర్‌కు భారతరత్న తప్పకుండా వస్తుంది – బాలకృష్ణ

Published on Feb 3, 2025 9:00 PM IST

నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘పద్మభూషణ్’ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయనకు ఈ అవార్డు రావడంతో అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. అయితే, తాజాగా తనకు పద్మభూషణ్ అవార్డు రావడంపై ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

తనకు పద్మభూషణ్ రావడం కాదు.. తన తండ్రి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ప్రకటించాలని.. తెలుగు ప్రజలు ఎంతో ఆశగా దీని కోసం చూస్తున్నారని.. ఆయనకు భారతరత్న తప్పకుండా వస్తుందని బాలయ్య అన్నారు. ఇక పద్మభూషణ్ అవార్డు తనకు రావడానికి ప్రేక్షకుల దీవెనలే కారణమని ఆయన అన్నారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు రావాలని బాలయ్య మరోసారి కామెంట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు