“తండేల్”.. డామినేషన్ చైతూదే.!

“తండేల్”.. డామినేషన్ చైతూదే.!

Published on Feb 2, 2025 3:01 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “తండేల్”. మంచి హైప్ ఉన్న ఈ సినిమాతో నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా ఈ సినిమాతో థియేట్రికల్ గా చైతు సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని వారంతా కోరుకుంటున్నారు.

అయితే ఈ సినిమా విషయంలో మాత్రం డామినేషన్ నాగ చైతన్యదే అని చెప్పవచ్చు. ఇది వరకు పలు సినిమాల విషయంలో హీరోయిన్ సాయి పల్లవి ఉంటే ఎక్కువ క్రెడిట్ ఆమెకే వెళ్ళేది కానీ తండేల్ కి మాత్రం పరిస్థితి ఇలా లేదు. అక్కినేని యంగ్ హీరో మాస్ నే ఇపుడు కనిపిస్తుంది. దీనితో నాగ చైతన్యదే ఈసారి పై చేయి అని చెప్పవచ్చు. ఇక రిలీజ్ అయ్యాక ఈ తండేల్ రాజు మేనియా ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు