‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Jan 22, 2025 9:01 PM IST

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ఎస్‌యు అరుణ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్ ఈ మూవీపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

అయితే, ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ లాక్ చేశారు. వీర ధీర శూరన్ పార్ట్ 2 చిత్రాన్ని మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. తొలుత ఈ సినిమాను 2025 పొంగల్ బరిలో రిలీజ్ చేయాలని చూశారు. కానీ అజిత్ నటించిన విదాముయార్చి మూవీ రిలీజ్ ప్రకటించడంతో విక్రమ్ సినిమా వాయిదా పడింది.

ఇక ఇప్పుడు మార్చి 27న ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో దాషార విజయన్ హీరోయిన్‌గా నటిస్తుండగా జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో ఈ సినిమాను ఎన్‌విఆర్ సినిమా సంస్థ రిలీజ్ చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు