వెంకీ మామ 300 కోట్లు కొట్టబోతున్నాడా!? అది కూడా పాన్ ఇండియా లేకుండా

వెంకీ మామ 300 కోట్లు కొట్టబోతున్నాడా!? అది కూడా పాన్ ఇండియా లేకుండా

Published on Jan 19, 2025 11:53 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్న సినిమా అలాగే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఇపుడు సంక్రాంతికి కానుకగా వచ్చిన చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” అనే చెప్పాలి. విక్టరీ వెంకటేష్ కి స్ట్రాంగ్ బేస్ అయినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ లో దర్శకుడు అనీల్ రావిపూడితో వచ్చిన ఈ చిత్రం ఇపుడు ఊహించని నంబర్స్ తో మన సీనియర్ హీరోస్ లో ఒక రికార్డు రన్ ని సెట్ చేస్తుంది.

ఇలా కేవలం 5 రోజుల్లోనే 160 కోట్లకి పైగా గ్రాస్ ని వసూలు చేసి ట్రేడ్ లో షాకివ్వగా ఇపుడు ఈజీగా 200 కోట్ల మార్క్ ని కూడా దాటేస్తుంది. అయితే ఇక్కడ అసలు టాక్ ఏంటంటే వెంకీ మామ సెన్సేషనల్ 300 కోట్ల క్లబ్ లో జాయిన్ కానున్నాడా? అంటే ఇప్పుడు ఉన్న మూమెంట్ చూస్తుంటే ఈ 300 కోట్ల మార్క్ కూడా ఈజీ అన్నట్టే ఉందని చెప్పాలి.

సంక్రాంతి నుంచి మొదటి వీకెండ్ కే 200 కోట్ల గ్రాస్ ని సినిమా కొట్టేస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ గా సోమవారం బుకింగ్స్ కూడా ఆల్రెడీ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. సో లాంగ్ రన్ లో ఈ మార్క్ కూడా అందుకునే ఛాన్స్ డెఫినెట్ గా ఉందని చెప్పవచ్చు. ఇపుడు యావరేజ్ గా చూసుకున్నా సంక్రాంతికి వస్తున్నాం వరల్డ్ వైడ్ గా 30 కోట్లకి పైగా గ్రాస్ ని డైలీ రాబడుతుంది.

దీనితో లాంగ్ రన్ లో తప్పకుండా 300 కోట్ల మార్క్ అందుకే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. మరి ఇదే కానీ జరిగితే మన తెలుగు నుంచి ఈ రికార్డు మార్క్ అది కూడా ఎలాంటి పాన్ ఇండియా సినిమా కాకుండా అందుకునే సినిమాగా పైగా మన సీనియర్ హీరోస్ నుంచి కూడా ఫస్ట్ ఎవర్ హీరోగా వెంకీ మామ నిలిచే అవకాశం ఉందని చెప్పాలి. మరి వేచి చూడాలి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ వండర్ ని కూడా అందుకుంటుందో లేదో అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు