మహేష్ బాబు సినిమాలో హైలైట్ కానున్న యాక్షన్ ఎపిసోడ్స్

మహేష్ బాబు సినిమాలో హైలైట్ కానున్న యాక్షన్ ఎపిసోడ్స్

Published on May 23, 2013 2:12 PM IST

Mahesh-Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో మహేష్ బాబు చాలా అందంగా కనిపించనున్నాడని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కూడా వుండనున్నాయని సమాచారం. గతం లో ‘ఏక్ థ టైగర్’ సినిమాకి పని చేసిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కాన్రాడ్ పల్మిసనో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ కూడా ఈ సినిమాకి పనిచేస్తున్నాడు. ఈ మద్య పీటర్ హెయిన్ ఆద్వర్యంలో మహేష్ బాబు పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో హైదరాబాద్ లో ప్రారంభంకానుంది. జూన్ రెండవ వారం లో ఈ సినిమా టీం 45 రోజుల పాటు లండన్ వెళ్ళనుంది.

మహేష్ బాబు ఈ సినిమాలో సిక్స్ ఫ్యాక్ తో కనిపించనున్నారని దానికోసం కండలు కూడా పెంచుతున్నాడని గత కొన్ని నెలలుగా ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చక్కని భాడీతో కనిపించడానికి మహేష్ బాబు ఫిట్నెస్ గురు క్రిస్ గెతిన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

తాజా వార్తలు