సంథింగ్….సంథింగ్ అంటూ సిద్ధమైన సిద్దార్ధ

సంథింగ్….సంథింగ్ అంటూ సిద్ధమైన సిద్దార్ధ

Published on May 23, 2013 1:09 AM IST

Something-Something-New
సిద్దార్థ్, హన్సికలు జంటగా నటిస్తున్న ‘సంథింగ్….సంథింగ్’ సినిమా జూన్ మధ్యలో విడుదలకు సిద్ధంగా వుంది. సుందర్ సి ఈ సినిమాకు దర్శకుడు. కుష్బూ నిర్మాత. ఈ చిత్రం యొక్క తెలుగు అనువాద హక్కులను లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ కామెడీ ఎంటర్టైనర్లో గణేష్ వెంకటరామన్, బ్రహ్మానందం కూడా నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణ చాలా భాగం హైదరాబాద్, చెన్నైలలోనే జరిగినా, ఇటీవలే ఈ సినిమా షూటింగ్ జపాన్ లో ముగించుకుంది.ఈ పాటలు సినిమాకు హై లైట్ గా నిలవనున్నాయి. ఈ సినిమాలో హీరో, హీరొయిన్లు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా కనిపిస్తారు. హీరోకు లవ్ టిప్స్ ఇచ్చే లవ్ గురు పాత్రలో బ్రహ్మానందం కనిపిస్తాడు. ఆడియోకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. సత్య సంగీతం అందించాడు.

తాజా వార్తలు