బెంగుళూరులో జండా పాతనున్న నాని

బెంగుళూరులో జండా పాతనున్న నాని

Published on May 22, 2013 9:30 PM IST

Jenda-Pai-Kapiraju
ఈమధ్య నానీ నటిస్తున్న ‘జెండాపై కపిరాజు’ సినిమా షూటింగ్ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఇటీవలే చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ కు గానూ రెండు రోజుల క్రితం బెంగుళూరు వెళ్ళింది. ఈ సోషల్ డ్రామాలో నానీకి జంటగా అమలా పాల్ కనిపించనుంది. కె.ఎస్ శ్రీనివాసన్ నిర్మాణంలో సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇదే సినిమా తమిళ వెర్షన్లో నానీ పాత్రను జయం రవి పోషిస్తున్నాడు.
వాస్తవిక సంఘటనల నడుమ ప్రతీ మనిషిలోనూ రెండు విభిన్న కోణాలు ఉంటాయని, మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షనే మన బ్రతుకుకు మార్గామని తెలిపే రెండు విభిన్న పాత్రలలో నాని కనిపిస్తాడు. ఇందులో 40ఏళ్ళ వాడిగా కనిపించడానికి గుండు చేయించుకున్నాడు. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగష్టులో విడుదలకావచ్చు.

తాజా వార్తలు