నేను నటించడం లేదన్న రాజమౌళి

నేను నటించడం లేదన్న రాజమౌళి

Published on May 22, 2013 1:06 PM IST

SS-Rajamouli

గత కొద్ది రోజులుగా ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో హాల్ చల్ చేస్తోంది. ఈ ప్రత్యేకమైన మీసంతో స్టైలిష్ గా ఉన్న రాజమౌళిని చూసిన సినీ ప్రేక్షకులు రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలో నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి మాత్రం తోసిపుచ్చారు. ‘నేను బాహుబలి సినిమాలో నటించడం లేదు. ఈ ఫోటో మూడు సంవత్సరాలకు ముందు తీసింది. అప్పట్లో నేను సరదాగా నా గడ్డాన్ని ఆ స్టైల్లో మార్చుకున్నానని’ ట్వీట్ చేశాడు.

ఇంతవరకు తెలుగులో ఎవరు నిర్మించనంత భారీ వ్యయంతో నిర్మించబడుతున్న సినిమా ”బాహుబలి’. ఈ సినిమా జూన్ లో మొదలవుతుంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటిలో భారీ సెట్ ను వేసారు. ఈ సినిమాలో ప్రభాస్, రానాలు ప్రధాన పాత్రలలో నటిస్తుండగా అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్కా మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.

తాజా వార్తలు