తెలుగు సినిమా ఖ్యాతిని నలుగురికీ తెలపమంటున్న తమ్మారెడ్డి

తెలుగు సినిమా ఖ్యాతిని నలుగురికీ తెలపమంటున్న తమ్మారెడ్డి

Published on May 22, 2013 3:45 AM IST

tammareddy-bharadwaja

తెలుగు సినీ ఘనకీర్తిని కాపాడుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం ఛాంబర్ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో మొదటి అడుగుగా ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్లో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భారాద్వాజ ఈ విధంగా తెలిపారు “ఈ మధ్యే భారతీయ సినిమా వందేళ్ళు పూర్తిచేసుకున్న నేపధ్యంలో మన తెలుగు సినిమా ద్వారా భారతీయ సినిమా ఎదుగుదలకు మనం పడ్డ కృషి వారికి తెలియాలి. భారతీయ సినిమాకు తలమానికం అయిన రఘుపతి వెంకయ్య లాంటివాళ్ళు మనకు ఉన్నారు. చాలా తెలుగు సినిమాల రికార్డులు, రీళ్ళు, ఆడియో టేపులు, వాల్ పోస్టర్లు, న్యూస్ పేపర్ క్లిప్పింగులు, పుస్తకాలు మొదలగునవి మనదగ్గర లేకపోవడం దురదృష్టకరం. మన తెలుగు సినిమా ఖ్యాతిని తెలియపరచడానికి ఈ జూన్ లో ఎక్షిభిషన్ నిర్వహించి విధవిధమైన సెమినార్లు ఇద్దామని అనుకుంటున్నామని”తెలిపారు.

ఆ తరువాత తమ్మారెడ్డి మరియు జనరల్ సెక్రటరీ అశోక్ కుమార్ ఈ 75 ఏళ్ళ వజ్రోత్సవాన్ని ఏర్పాటు చెయ్యడానికి ఎంత కష్టపడ్డారో తెలిపారు. వారి కష్టానికి మంచి ప్రశంసలే అందాయి. “మాకు తెలియని పాత సినిమాల చాలా సమాచారం మీ మీడియాలో తలపండిన రచయితలు అందించిన సమాచారం ద్వారా తెలుసుకోగాలిగాము. త్వరలో 100 ఏళ్ళ తెలుగు సినిమా, 100 ఏళ్ళ టాకీ సినిమా వేడుకలు నిర్వహించాలి గనుక మన సమిష్టి కృషితో మన తెలుగు సినిమా ఖ్యాతిని అందరికీ తెలియజేయాలని “అశోక్ కుమార్ అన్నారు.

తాజా వార్తలు