ఎన్.టి.ఆర్ బర్త్ డే వేడుకలో డైట్ ను వదిలేసిన రాజమౌళి

ఎన్.టి.ఆర్ బర్త్ డే వేడుకలో డైట్ ను వదిలేసిన రాజమౌళి

Published on May 21, 2013 11:53 AM IST

NTR's-bash-upsets-Rajamouli

ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి ఫిట్ గా ఉండడానికి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. బహుశా ఇది త్వరలో ప్రారంభం కానున్న కాస్త కష్టమైన ‘బాహుబలి’ షూటింగ్ కోసం ఫిట్ గా ఉండటానికి ఆయన ఇలా చేస్తున్నట్టు ఉన్నారు. రాజమౌళి ఎంత పట్టుదల వున్న మనిషో మన అందరికి తెలుసు. కానీ ఆ పట్టుదలని ఆయన ఎన్.టి.ఆర్ కోసం విడిచిపెట్టాడు.

ఎన్.టి.ఆర్ నిన్న పుట్టినరోజు వేడుకని జరుపుకున్న విషయం మనందరికి తెలుసు. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్ కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ని పార్టీ ఇచ్చాడు, పార్టీ అన్నాక అన్ని రకాల ఫుడ్ అక్కడ ఉంటుంది. ఈ పార్టీకి వచ్చిన రాజమౌళి గారు అక్కడ ఏర్పాటు చేసిన డెసర్ట్స్ ని ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అలాగే ‘గత వారంగా నేను డైట్ చేస్తున్నాను, అదంతా తారక్ పుట్టిన రోజుతో పోయింది’ అని ట్వీట్ చేశారు.

తాజా వార్తలు