మోహన్ బాబు తన నూతన చిత్రం షూటింగ్ యూరోప్ లో మొదలుపెట్టాడు. ఇంకా పేరు ఖరారు చెయ్యని ఈ మల్టీ స్టారర్ సినిమాను శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మంచు విష్ణు, మంచు మనోజ్, హన్సిక,రవీనా టండన్,ప్రణిత సుభాష్, వరుణ్ సందేశ్ మరియు తనీష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విష్ణు, మనోజ్ ఒక్కో పాటలో నటించగా ఇప్పుడు మోహన్ బాబు తరుణం వచ్చింది. వెన్నిస్ లో రవీనా టండన్ తో కలిసి మోహన్ బాబు స్టెప్పులువేస్తున్నాడు. రాజు సుందరం కొరియోగ్రాఫర్. దాదాపు దశాబ్ద కాలం తరువాత రవీనా టండన్ మళ్ళీ తెలుగులో నటిస్తుంది. ఆమె టాలీవుడ్లో చివరిగా ‘ఆకాశవీధిలో’ సినిమాలో నాగార్జున సరసన నటించింది. అంతకుముందు బాలకృష్ణ సరసన ‘బంగారు బుల్లోడు’ సినిమాలో కనిపించింది.
గత కొన్నేళ్ళుగా మోహన్ బాబు పలు చిత్రాలలో నటించినా, పోయిన మూడేళ్ళలో మొదటిసారిగా అతను ఒకపాటకు డాన్స్ చేస్తున్నాడు. 2009లో విడుదలైన ‘సలీమ్’ సినిమాలో అతను ఆఖరిసారిగా డాన్సు చేసాడు. ‘ఝుమ్మంది నాదం’ సినిమా తరువాత నటిస్తున్న ఆయనను తరువాత ‘జగద్గురు ఆది శంకరాచార్య ‘ లో నటిస్తున్నాడు. ఈ మల్టీ స్టారర్ సినిమాను యూరోప్ లో తీస్తూన్నారు. ఇది చాలా ఎంటర్టైనింగ్ రీతిలో సాగుతుందని బృందం నమ్మకంగా వుంది. ఈ సినిమాకు గోపీ మోహన్, కోన వెంకట్ మరియు బి.వి.ఎస్ రవి స్క్రిప్ట్ బాధ్యతలు చేపట్టారు. ఎం.ఎం కీరవాణి, బప్పి లహరి, అచ్చు మరియు బాబా సహెగల్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు విష్ణు మరియు మనోజ్ నిర్మాతలు.
రవీనా టండన్ తో స్టెప్పులేయనున్న మోహన్ బాబు
రవీనా టండన్ తో స్టెప్పులేయనున్న మోహన్ బాబు
Published on May 18, 2013 9:35 AM IST
సంబంధిత సమాచారం
- థియేటర్/ఓటీటీ’ : ఈ వారం క్రేజీ సిరీస్ లు, చిత్రాలివే !
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- 10 రోజుల్లో ‘లిటిల్ హార్ట్స్’ సెన్సేషన్.. ఏకంగా రూ.32 కోట్లు..!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ‘కిష్కింధపురి’తో బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ కమ్ బ్యాక్..!
- ఎవరు విడాకులు తీసుకొన్నా నాతో పెళ్లి అనేవారు – మీనా
- క్రికెట్ కాదు, దేశభక్తే ముఖ్యం: షేక్‌హ్యాండ్ నిరాకరణపై కెప్టెన్ సూర్యకుమార్ గట్టి సమాధానం
- బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?