First Posted at 12:15 on Apr 21st
భారతీయ సిని ఇండస్ట్రీలో అందాల తార శ్రీదేవి. ఆమె అందానికి, తెలివికి పెట్టింది పేరు. అందరి ఆడవారిలానే శ్రీదేవికి కూడా ఒక వీక్నేస్ వుంది అదే జ్యూవాలరి అంటే ఇష్టం. ఆమె తనకు జ్యూవాలరి అంటే ఇష్టమని చెప్పింది. ఫేమస్ తనిష్క్ జ్యూవాలరికి బ్రాండ్ అంబాజిడార్ గా వున్నా ఆమె ఈ మద్య తనిష్క్ జ్యూవాలరి కోసం చేసిన యాడ్ షూటింగ్ లో మాట్లాడుతూ ‘నా వీక్నేస్ జ్యూవాలరి. ఎక్కడైనా నేను జ్యూవాలరి షాప్ ని చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అలాగే నా కూతుర్లకు కూడా జ్యూవాలరి అంటే చాలా ఇష్టం’ అని చెప్పింది. ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమా మంచి విజయాన్ని సాదించిన తరువాత శ్రీదేవి ప్రస్తుతం మంచి స్క్రీప్ట్ కోసం చూస్తున్నారని సమాచారం.