బ్లాక్ బస్టర్ చిత్రాల డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి తన సినిమా కోసం ఎంతో రీసర్చ్ చేసి స్క్రిప్ట్ ని పక్కాగా రాసుకుంటారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రదక కూడా చాలా రోజులు జరుగుతుంది. ఇలా సినిమా తీయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని, అలాగే నటీనటుల నటన, ఎమోషనల్ సీన్స్ ని పర్ఫెక్ట్ గా తీసి ఆడియన్స్ ని సీట్లో నుంచి లేవకుండా చేస్తారు.
ప్రస్తుతం రాజమౌళి తీయనున్న ‘బాహుబలి’ సినిమా కోసం గత కొద్ది రోజులుగా చాలా సీరియస్ గా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అలాగే నటీనటులకు ట్రైనింగ్ ఇప్పించడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. గత కూడి వారాలుగా నటీనటులకు గుర్రపు స్వారీ, కత్తి యుద్దాల ట్రైనింగ్ జరుగుతోంది. ఈ రోజు ఈ చిత్ర టీం మొత్తం ఒకరి పాత్రని ఒకరు బాగా అర్థం చేసుకోవాలని స్క్రిప్ట్ రీడింగ్ సెషన్లో కోసం ఒకచోట కలిసారు. ‘ఈ చిత్ర నటీనటులు, టెక్నికల్ టీంతో స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ జరుగుతోంది. మొదటి సారి పూర్తి స్క్రిప్ట్ ని వింటుంటే చాలా బాగుందని’ శోభు యార్లగడ్డ ట్వీట్ చేసాడు. ఫోటోని కూడా మీకు అందిస్తున్నాం. ఈ ఫోటోలో ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి, సెంథిల్ కుమార్, నాజర్, జొన్నవిత్తుల మొదలైన వారిని చూడొచ్చు.
బాహుబలి త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని ఆశించవచ్చు. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ ని వేస్తున్నారు. సబు సైరిల్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
ప్రభాస్, రానా, అనుష్క… లతో బాహుబలి స్క్రిప్ట్ రీడింగ్ సెషన్
ప్రభాస్, రానా, అనుష్క… లతో బాహుబలి స్క్రిప్ట్ రీడింగ్ సెషన్
Published on Apr 21, 2013 3:55 AM IST
First Posted at 03:55 on Apr 21st
సంబంధిత సమాచారం
- అప్పుడు ఇడ్లీకి కూడా డబ్బులు లేవు – ధనుష్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మహేష్’ సినిమా కోసం భారీ కాశీ సెట్ ?
- పవన్ ఆ విద్యను ప్రోత్సహించాలి – సుమన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘ఓజి’, ‘ఉస్తాద్’ లని ముగించేసిన పవన్.. ఇక జాతరే
- ఆసియా కప్ హై వోల్టేజ్ మ్యాచ్: పాకిస్థాన్ని 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమ్ ఇండియా
- ‘మోహన్ బాబు’ది విలన్ పాత్ర కాదు అట !
- ఒకే రోజు 1.5 మిలియన్ వసూళ్లు కొట్టిన ‘ఓజి’, ‘మిరాయ్’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్‌తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో