విభిన్న చిత్రాల దర్శకుడు తేజ తన మొదటి సినిమా ‘చిత్రం’, ‘జయం’ నుండి చివరిగా వచ్చిన ‘నీకు నాకు’ వరకు తన సినిమాల్లో కొత్త రకమైన పాత్రలను, కొత్త పాయింట్స్ ని టచ్ చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వం వహిస్తున్న ‘1000 అబద్దాలు’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో సాయిరాం శంకర్, ఎస్తర్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలోని పాటలను స్విట్జర్ ల్యాండ్ లో షూట్ చేసారు. తాజా సమాచారం ప్రకారం ఇందులోని కొన్ని పాటలను సింగిల్ టేక్ లో షూట్ చేసారు, తెలుగు ఫిల్మ్స్ లో ఇలా తియ్యడం ఎంతో ప్రయోగాత్మక టేకింగ్ అని చెప్పొచ్చు.
ఒక సాంగ్ మొత్తాన్ని కొరియోగ్రఫీ చేసి సింగిల్ టేక్ లో తియ్యడం అనేది చాలా కష్టమైన పని కానీ తేజ ఆ పనిని చేసి చూపించాడు. ఈ సాంగ్ సినిమాలో పెద్ద హైలైట్ అవుతుందని అంటున్నారు. రమణ గోగుల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్. సునీత పాలడుగు నిర్మిస్తున్న ఈ సినిమా మే లో ప్రేక్షకుల ముందుకు రానుంది.