ఏప్రిల్ 22 కి వాయిదా పడిన ఏక్షన్ 3డి ఆడియో విడుదల

ఏప్రిల్ 22 కి వాయిదా పడిన ఏక్షన్ 3డి ఆడియో విడుదల

Published on Apr 18, 2013 7:00 AM IST
First Posted at 20:30 on Apr 17th

action_3d_movie

అల్లరి నరేష్ తాజా చిత్రం ‘యాక్షన్ 3డి’ ఆడియో విడుదల ఏప్రిల్ 22 కి వాయిదా పడింది. ముందుగా ఏప్రిల్ 20న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ ఈ సినిమా ఆడియో ఏప్రిల్ 22 న ప్రసాద్స్ మల్టీప్లెక్స్ హైదరాబాద్ లో విడుదల కానుంది .అనిల్ సుంకర దర్శకత్వం వహించిన ఈ చిత్రం 3డి లో చిత్రీకరించిన మొదటి కామెడీ చిత్రం.

ఈ చిత్రం లో వైభవ్ రెడ్డి, శ్యాం, రాజు సుందరం, నీలం ఉపాధ్యాయ, స్నేహ ఉల్లాల్, కామ్న జట్మలాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సుదీప్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు . ఈ చిత్రాన్ని తమిళంలో కూడా చిత్రీకరించారు.బప్పా లహరి ,బప్పి లహరి సంగీతం అందించిన ఈ చిత్రానికి సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందించారు.

ఇటివలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి చాల మంచి స్పందన వచ్చింది . ఈ చిత్రం నవ్వుల విందు కానుంది . ఏక్షన్ 3డి మే మధ్యలో విడుదల కానుంది .

తాజా వార్తలు