వాయిదాపడ్డ ఇద్దరమ్మాయిలతో ఆడియో రిలీజ్

వాయిదాపడ్డ ఇద్దరమ్మాయిలతో ఆడియో రిలీజ్

Published on Apr 17, 2013 5:25 PM IST
First Posted at 17:25 on Apr 17th

Iddarammayilatho-(3)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’. ఈ సినిమా ఆడియోని ఏప్రిల్ 21న విడుదల చేయాలనుకున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం 21న ఈ సినిమా ఆడియోని విడుదల చేయడం లేదని ఈ సినిమా ప్రొడక్షన్ టీం తెలియజేశారు. ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని తొందరలో తెలియజేస్తామన్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో కేథరిన్, అమలా పాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను స్పెయిన్, థాయ్ ల్యాండ్లలో నిర్వహించారు. స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మేలో విడుదల చేయాలనుకుంటున్నారు.

తాజా వార్తలు