First Posted at 03.50 on Apr 17th
యువ టాలెంట్ ని ఎక్కడున్నా పసిగట్టే వాళ్ళలో సిద్దార్ధ్ ముందువరసలో ఉంటాడు. వేణు శ్రీరాం, పి జయేంద్ర, బాలాజీ మోహన్ మరియు నందినీ రెడ్డి వంటి దర్శకులను పరిచయం చేసిన తను ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజ్ తో కలిసి పనిచెయ్యనున్నాడు. ఈ డైరెక్టర్ ఈ మధ్యే ‘పిజ్జా’ సినిమాతో విజయపు బాటలో ఉన్నాడు. ఈ సినిమా తమిళ్ లోనే కాక ఇక్కడ కుడా మంచి విజయం సాదించడంతో అతని ప్రతిభ నలుగురికీ తెలిసింది. ఇంకా పేరు ఖరారు చెయ్యని ఈ సినిమా కామెడీ కలగలిపిన క్రైమ్ థ్రిల్లర్ గా,తెలుగు తమిళ భాషల్లో మనముందుకు రానుంది. ఇదివరకు ధనుష్, తాప్సీ జంటగా నటించిన ‘ఆడుకలం’ సినిమాను నిర్మించిన కాతిరేసన్ ఈ సినిమాకి నిర్మాత. మిగిలిన చిత్ర వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.