ఆటోనగర్ సూర్యకి ఏమైంది??

ఆటోనగర్ సూర్యకి ఏమైంది??

Published on Apr 16, 2013 7:25 PM IST
First Posted at 19:30 on Apr 16th

autonagar-surya

అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న ‘ఆటోనగర్ సూర్య ‘ విడుదలకు ముందు మంచి అంచనాలను అందుకుంది. దేవ కట్టా దర్శకత్వం వహించడం, సరికొత్త కధ, చైతన్య మరియు సమంత కాంబినేషన్ మొదలుగునవి దానికి కారణాలు. ఈ సినిమా మొదటి లుక్ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. కాకపోతే ఇవేవి ఈ సినిమా విడుదలకు ఇప్పుడు సహాయం చేయలేకపోతున్నాయి. దీనికి కారణం ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సంస్థ కష్టాలలో పడటమే. ఈ సినిమా భవిష్యత్తు ఏమిటో ఇప్పుడు ఎవరికీ తెలియని పరిస్థితి.

మేము ఇండస్ట్రీలో పలువురిని అడిగి తెలుసుకున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ దగ్గరనుండి అక్కినేని నాగార్జున కొనుగోలు చేస్తున్నాడట. పోస్ట్ ప్రొడక్షన్ మరియు 10రోజుల చిత్రీకరణ మిగిలి ఉన్న ఈ సినిమాని ఉన్న పరిస్థితిలలోనే కొనుక్కుంటారట. కానీ సరైన ధర కుదరకపోవడం వల్ల కాస్త వెనకడుగు వేస్తున్నాడని వినికిడి.

ఈ సినిమా విడుదలకు నోచుకుంటుందా అనేది ఇప్పుడు ఎవ్వరూ జవాబు చెప్పలేని ప్రశ్నగా మిగిలింది. ఈ సినిమాలోని తారలు, దర్శకుడు వేరే సినిమాలు చేసుకుంటున్నారు. ఇలాంటి సినిమా ఇటువంటి పరిస్థితుల నడుమ ఆగిపోవడం బాధాకరం. త్వరలోనే ‘ఆటోనగర్ సూర్య ‘ సినిమా విడుదల కావాలని కోరుకుందాం

తాజా వార్తలు