మోహన్ కృష్ణ ఇంద్రగంటి తన కెరీర్లో మొదటిసారిగా ఒక పరిపక్వ రీతిలో సాగే ప్రేమకధని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటివరకు అతను హాస్యాన్ని,క్రీడా నేపధ్యాన్ని, ఫాంటసి సినిమాలని తీసి విమర్శకులను మెప్పించాడు. మొదటిసారిగా ఇప్పుడు ఒక నిజమైన కధని రాసుకున్నాడు. ఆ సినిమాయే ‘అంతకుముందు ఆతరువాత’. సుమంత ఆశ్విన్, ఈష ప్రాధాన పాత్రధారులు. ఈ సినిమాలో అలనాటి అందాల తార మధుబాల తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టనుంది. ఒక ఇంటర్వ్యూలో మన డైరెక్టర్ చెప్పిన దానిప్రకారం ‘అంతకుముందు ఆతరువాత’ ఒక జీవిత నేపధ్యంలో సాగే కధ అంట. తన జీవితంలో ఎదురైన సన్నివేశాలను కూడా కలిపాడట. ఇక్కడ ప్రజలు బంధాల గురించి ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు కనుక ఆ తరహాలో సాగే ప్రేమకధను తీసాడట.
చాలా సినిమాలలో చూపించినట్టు స్త్రీలకు డబ్బే ముఖ్యం అన్నట్టు కాకుండా మోహనకృష్ణ ఈ కధను విబిన్న రీతిలో తెరక్కెక్కిస్తున్నాడు. “స్త్రీలు తమ ఇష్టాలకోసం పనులు చేస్తున్నారు. డబ్బు కోసమో తమ జీవన భవిష్యత్తుకోసమో కాదని”అన్నాడు. ఈ సినిమాకి కె.ఎల్ దామోదర్ రెడ్డి నిర్మాత. వేసవిలో ఈ సినిమా మన మందుకి రావచ్చు.