ఆ పాత్రని తనకన్నా బెటర్ గా ఇంకెవ్వరూ చెయ్యలేరు – నితిన్

ఆ పాత్రని తనకన్నా బెటర్ గా ఇంకెవ్వరూ చెయ్యలేరు – నితిన్

Published on Apr 14, 2013 11:10 PM IST

Nitin-Gunde-Jaari-Gallanthayindhe

యంగ్ హీరో నితిన్ తన రాబోయే సినిమా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా సక్సెస్ పై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్, నిత్యా మీనన్, ఇషా తల్వార్ ప్రధాన పాత్రల్లో నటించారు. తన చుట్టూ పక్కల ఉన్నవాల్లకంటే తనే స్మార్ట్ గా ఉన్నాననుకునే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. ‘ఇష్క్’ సినిమా తర్వాత నితిన్ – నిత్యా మీనన్ మరోసారి ఈ సినిమా కోసం జోడీ కట్టారు.

‘ఇష్క్ సినిమాకి పనిచేసిన చాలా మంది ‘గుండెజారి గల్లంతయ్యిందే’కి పనిచేసారు. అలాఅని ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ లో నాది నిత్యా మీనన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇష్క్ కన్నా బాగుంటుంది. నలుగురి మధ్య జరిగే లవ్ స్టొరీని చివరి వరకూ ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఎవరు ఎవరికి సైట్ కొడుతున్నారా అనేది చివరి వరకూ సస్పెన్స్. ఈ సినిమాలో నిత్యా మీనన్ పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. ఆ పాత్రని నిత్యా కన్నా బెటర్ గా ఇంకెవరూ చెయ్యలేరని’ నితిన్ అన్నాడు.
విక్రం కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి నిఖితా రెడ్డి నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా శ్రీ రామనవమి కానుకగా ఏప్రిల్ 19న విడుదల కానుంది.

తాజా వార్తలు