‘సొంతఊరు’, ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ చిత్రాల దర్శకుడు మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ తో మనముందుకు రానున్నాడు. ఈ సినిమాకి ముందుగా ‘పట్టుదల’ అనే టైటిల్ ని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆ టైటిల్ ని కాస్తా ‘నేనేం.. చిన్న పిల్లనా?’ అని మార్చారు. అందాల రాక్షసి ఫేం రాహుల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా తన్వి వ్యాస్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైఇ డా. డి. రామానాయుడు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. హైదరాబాద్ లో జరిగిన ఈ షెడ్యూల్లో కొన్ని సీన్స్ మరియు ఒక సాంగ్ ని చిత్రీకరించారు.
ఈ మూవీ గురించి రామానాయుడు మాట్లాడుతూ ‘ ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 1న మొదలు పెట్టాము, ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసాము. ఈ మూవీ ద్వారా తన్వి వ్యాస్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాం. ఈ ఫ్యామిలీ స్టొరీని సునీల్ కుమార్ రెడ్డి బాగా తీస్తున్నారని’ అన్నాడు. ఒక విలేజ్ నుండి సిటీ కొచ్చిన తరవాత ఆమె లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా మారిందా అనేదే ఈ చిత్ర కథాంశం ని సునీల్ కుమ్మార్ రెడ్డి అన్నాడు. ఎం.ఎం శ్రీ లేఖ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ యూరప్ లో జరగనుంది.