నవదీప్ – స్నేహ ఉల్లాల్ జంటగా ‘అంతా నీ మాయలోనే’

నవదీప్ – స్నేహ ఉల్లాల్ జంటగా ‘అంతా నీ మాయలోనే’

Published on Apr 10, 2013 1:15 PM IST

Navadeep-Sneha-ullal
నవదీప్ , స్నేహ ఉల్లాల్ హీరో, హీరోయిన్స్ గా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న సినిమా ‘అంతా నీ మాయలోనే’. కృష్ణ మొదటి సారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వాటర్ మిలన్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. స్వరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మద్య ఈ సినిమా కోసం నవదీప్, స్నేహ ఉల్లాల్ లపై ఫోటో షూట్ చేసారు. ఈ సినిమాని లాంచనంగా ఏప్రిల్ 11 అనగా ఉగాది రోజున ప్రారంబించనున్నారు. ‘ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమా నా కెరీర్ కి బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందని’నవదీప్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం నవదీప్ హీరోగా నటించిన ‘వసూల్ రాజా’ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమాలో రీతు బర్మేచ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కాకుండా నవదీప్ మరో రెండు సినిమాలు చేస్తున్నాడు అందులో ఒకటి ‘బంగారు కోడిపెట్ట’. రెండవది ‘పొగ’ ఈ సంవత్సరం తరువాత ఈ మూవీ విడుదలయ్యే అవకాశం వుంది. ఈ మధ్యే తను ‘బాద్షా’ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించడు. ఇలాంటి పాత్రాలు ఇంకా ఏమన్నా చేస్తున్నారా అని ఒక అబిమాని అడిగిన దానికి సమాధానమిస్తూ ‘ ప్రస్తుతం నేను ఎటువంటి నెగిటివ్ పాత్రలు చేయడం లేదని’ అన్నాడు.

తాజా వార్తలు