ఎం.ఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ ‘తూనీగా తూనీగా’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాకి ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న సుమంత్ అశ్విన్ తన రెండవ సినిమా కోసం సిద్దమవుతున్నాడు. ‘అష్టా చమ్మా’, ‘గోల్కొండ హై స్కూల్’ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ సినిమాకి డైరెక్టర్.
గత సంవత్సరం మోహనకృష్ణ కొత్తవారితో సినిమా చెయ్యాలనుకుంటున్నానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందో సుమంత్ అశ్విన్ ని ఎంచుకున్నారు. ‘అలా మొదలైంది’ నిర్మించిన దామోదర్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి ‘అంతక ముందు ఆ తరువాత’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని సమాచారం.