మరి కొద్ది సేపట్లో రామ్ చరణ్ తుఫాన్ ఫస్ట్ లుక్

మరి కొద్ది సేపట్లో రామ్ చరణ్ తుఫాన్ ఫస్ట్ లుక్

Published on Apr 2, 2013 12:45 AM IST

Ram-Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ కి పరిచయమవుతున్న సినిమా ‘జంజీర్’. ఈ సినిమాని ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో ‘తుఫాన్’ అనే టైటిల్ ని ఖరారు చేసామని ఇదివరకే చెప్పాము. మరి కొద్ది సేపట్లో అనగా ఒక ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి ఈ మూవీ ఫస్ట్ లుక్ ని పార్క్ హయత్ హోటల్లో లాంచ్ చేయనున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అపూర్వ లిఖియా డైరెక్టర్. హిందీలో సంజయ్ దత్ చేస్తున్న షేర్ ఖాన్ పాత్రని తెలుగు శ్రీహరి చేస్తున్నారు.

మార్చి 27 రామ్ చరణ్ పుట్టిన రోజు, ఈ సందర్భంగా ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న సినిమాల ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ‘ఎవడు’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ‘ఎవడు’ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తున్నా తరుణంలోనే ఇప్పుడు ‘తుఫాన్’ ఫస్ట్ లుక్ విడుదల చేయడం మెగా ఫ్యాన్స్ కి పెద్ద ట్రీట్ అనే చెప్పుకోవాలి. తూఫాన్ ఫస్ట్ లుక్ కోసం సైట్ ని విజిట్ ఉండండి అతి త్వరలో మీకందిస్తాము..

తాజా వార్తలు