నాని నూతన చిత్రం ‘పైసా’ చిత్రీకరణ చివరిదశలో ఉంది. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రమేష్ పుప్పాల యెల్లో ఫ్లవర్స్ బ్యానర్ ద్వారా నిర్మిస్తున్నాడు. కేథరీన్ త్రేస ముఖ్య నటీమణిగా ఉన్న ఈ సినిమాలో సిద్ధిక శర్మ మరో హీరొయిన్. ప్రస్తుతం నానిపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. నాని ఇంట్రడక్షన్ సీన్ మినహా మిగిలిన షూటింగ్ అంతా పూర్తయింది.
కాస్త ఎక్కువ కాలం ఈ సినిమా ప్రొడక్షన్లో ఉన్నప్పటికీ ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. నాని ఈ సినిమాలో ప్ర’క్యాష్’గా కనిపించనున్నాడు. మానవ బంధాలు కన్నా ఈరోజుల్లో డబ్బే మనకు ప్రధానం అన్న నేపధ్యంలో సాగే కధ. సమాచారం ప్రకారం కృష్ణ వంశీ ఈ సినిమాని అద్బుతంగా తీర్చిదిద్దాడట. ఈ సినిమాతో తనలో ఇదివరకు ఉన్న వేడిని మరోసారి మనకు చూపించనున్నాడు. చరణ్ రాజ్ ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నాడు. సాయి కార్తిక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఏప్రిల్ 11న విడుదల కావచ్చని అంచనా.