మహేష్ బాబు ‘మురారి’ సినిమాలో శబరిగా నటించి తెలుగు సిని ప్రియుల మనసు దోచుకున్ననటిమణి సుకుమారి చనిపోయారు. 74 సంవత్సరాల సుకుమారి చెన్నై హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించింది. సుకుమారి నాగార్జున ‘నిర్ణయం’ సినిమాలో అమల అంటీగా నటించారు. సుకుమారి గారు తెలుగు, తమిళ, మళయాలం, ఓడిసిలో కలిపి దాదాపు 2500ల సినిమాలలో నటించింది. ఇండియా గవర్నమెంట్ 2003 లో ఈమెకు పద్మశ్రీని ఇచ్చి సత్కరించింది.
123తెలుగు.కామ్ సుకుమారి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతిని తెలియజేస్తున్నాం