కొలీవుడ్లో కుడా మొదలైందట

కొలీవుడ్లో కుడా మొదలైందట

Published on Apr 2, 2013 4:20 AM IST

Gautham-Karthik
నందినీ రెడ్డి దర్సకత్వం వహించిన అలా మొదలైంది సినిమా 2011 లో వచ్చిన సైలెంట్ హిట్లలో ఒకటిగా నలిచింది. నందినీ రెడ్డి, నిత్యా మీనన్, నాని కెరీర్లకి ఈ సినిమా మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. తెలుగులో సినిమా విడుదల అయిన వెంటనే ఒక తమిళ్ సంస్థ నిర్మాణ హక్కులు సొంతం చేసుకుంది. రెండేళ్ళు గడిచినాగానీ ఇప్పటికీ ఆ రీమేక్ లో ఎవరు నటిస్తారో సమాచారం అందలేదు. ఆఖరికి ఈ చిత్రం వేసవిలో మొదలుకానుంది.
మణి రత్నం తెరకెక్కించిన ‘కడలి’ సినిమాలో నటించిన గౌతం కార్తిక్ తమిళ్ వెర్షన్లో నానీ పాత్రని భర్తీ చేయ్యనున్నాడు. ఈ సినిమాకి హీరొయిన్ ఇంకా ఖరారు కావాల్సివుంది. ప్రియదర్శన్ పూర్వపు అసోసియేట్ అయిన రవి త్యాగరాజన్ ఈ సినిమాకి దర్శకుడు. రవి ప్రసాద్ ప్రొడక్షన్స్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాకొట్టిన ‘కడలి’లో జాలరిగా కనిపించి ఇప్పుడు ఈ రీమేక్ లో లవర్ బాయ్ గా కనబడనున్న కార్తిక్ కి విమర్శకుల ప్రశంసలు అయితే బానే అందుతున్నాయి.

తాజా వార్తలు