బాహుబలి కోసం భారీ సెట్

బాహుబలి కోసం భారీ సెట్

Published on Apr 2, 2013 8:00 AM IST

rajamouli1
ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులను శరవేగంగా ముగించుకుని ప్రారంభంకావడానికి సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి గాను ఒక భారీ సెట్ ను రామోజీ ఫిలింసిటీలో వేసారు. ‘అపరిచితుడు’, ‘రోబో’ సినిమాలకు అదిరిపోయే సెట్లు వేసి మనల్ని మరోలోకంలోకి తీసుకువెళ్ళిన జాతీయ అవార్డు గ్రహీత సబు సైరిల్ ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్లో మొదలవుతుంది. ముందుగా ఒక పాటను చిత్రీకరిస్తారు.

ఈ యాక్షన్ అడ్వెంచర్లో ప్రభాస్, అనుష్క ప్రధాన పాత్రలు పోషిస్తుండగా రానా దగ్గుబాటి విలన్ గా కనబడనున్నాడు. ఇందులో వీరిద్దరూ అన్నదమ్ముళ్ళుగా కనిపిస్తున్నారు. వారి వారి పాత్రలకు తగ్గట్టు దేహాన్ని సిద్దపరుచుకుంటున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కె. రాఘవేంద్ర రావు ఈ సినిమాకి సమర్పకుడు.

తాజా వార్తలు