ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకడైన హరీష్ శంకర్ పుట్టిన రోజు. మాస్ మహారాజ రవితేజ – జ్యోతిక కాంబినేషన్లో వచ్చిన ‘షాక్’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన హరీష్ శంకర్ ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. ఆ తర్వాత 2011లో మళ్ళీ రవితేజ తో ‘మిరపకాయ్’ సినిమా తీసి తొలి సూపర్ హిట్ అందుకున్న హరీష్ శంకర్ ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీసే అవకాశాన్ని కొట్టేసాడు. పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ జంటగా హిందీ మూవీ దబాంగ్ కి రీమేక్ గా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమా 2012లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, టాలీవుడ్ టాప్ గ్రాసర్ సినిమాల్లో ఒకటిగా చేరిపోయింది.
ఆ సినిమా విజయంతో హరీష్ శంకర్ రాత్రికి రాత్రే ఫుల్ ఫేమస్ అయిపోయాడు. హరీష్ శంకర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా సమంత – శృతి హాసన్లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు
123తెలుగు.కామ్ తరపున హరీష్ శంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.