ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2′ కి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. 2012 లో విడుదలై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘గబ్బర్ సింగ్’ సినిమాకి ఇది సీక్వెల్. పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ తో పాటు ఈ సినిమాని తన సొంత బ్యానర్ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరదా’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా షూటింగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కాకుండా సంపత్ నంది దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కే సినిమాకి పవన్ ఓకే చెప్పారు. ఈ సినిమాని శరత్ మరార్ నిర్మించనున్నాడు. అవన్నీ పూర్తి చేసుకొని ఎప్పుడు సినిమా సెట్స్ పైకి వెళుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ ని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గబ్బర్ సింగ్ గా చూస్తామా అని చర్చించుకుంటున్నారు.