బన్ని బర్త్ డే కానుకగా ఇద్దరమ్మాయిలతో ఫస్ట్ ట్రైలర్

బన్ని బర్త్ డే కానుకగా ఇద్దరమ్మాయిలతో ఫస్ట్ ట్రైలర్

Published on Apr 2, 2013 8:40 AM IST

Iddarammailatho
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ఫస్ట్ ట్రైలర్ ని అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా అనగా ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా బాలెన్స్ షూటింగ్ ని 10 రోజుల్లో ముగిస్తామని పూరి జగన్నాథ్ తెలిపారు. బార్సెలోనాలో రెండు నెలల లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇటీవలే ఈ చిత్ర యూనిట్ ఇండియాకి వచ్చారు. అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ఏప్రిల్ 5 నుంచి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్లు హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ‘ఎవడు’ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. బార్సెలోనా షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న అమలా పాల్ తన తమిళ సినిమా ‘తలైవా’ మూవీ షూటింగ్ కోసం ఆస్ట్రేలియా చేరుకుంది.

తాజా వార్తలు