టాలీవుడ్లో అగ్ర కధానాయకులు మహేష్ బాబు, ఎన్. టి. ఆర్ , అల్లు అర్జున్ లు ముగ్గురికి ఒక పోలిక ఉంది. వీరందరు పూరి జగన్నాధ్ సినిమాలో, వారిలో కనీసం ఇద్దరు శ్రీను వైట్ల, వి. వి. వినాయక్ చిత్రాలలో నటించారు. ఇదే కాక మరో పోలిక ఎంటంటే ప్రస్తుతం సుకుమార్ సినిమాలో, ‘బాద్ షా’ మరియు ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రాలకు పనిచేస్తున్న అశ్విన్ మావ్లె తో కలిసి వేరు ముగ్గురూ పనిచెయ్యడం.
అశ్విన్ హైదరాబాద్లో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, అల్లు అర్జున్ ఇతనితో ‘ఆర్య2’, ‘వరుడు’, ‘వేదం’ సినిమాలలో పనిచేసాడు. ఇప్పుడు యూరోప్ లో చిత్రీకరిస్తున్న ఎన్. టి. ఆర్ స్టిల్స్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తూ అశ్విన్ ని వెలుగులోకి తీసుకొచ్చాయి. మహేష్ బాబు తదుపరి చిత్రానికి కూడా ఇతనే కాస్ట్యూమ్ డిజైనర్