మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ మంచు నిర్మించిన సినిమా ‘గుండెల్లో గోదారి’. ఆది పినిశెట్టి, తాప్సీ, సందీప్ కిషన్, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ద్వారా కుమార్ నాగేంద్ర దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. 1986 గోదావరి వరదల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రేపు ఆంధ్ర ప్రదేశ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకున్న ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అసలు దర్శకుడవ్వడానికి గల స్ఫూర్తి ఏమిటని డైరెక్టర్ కుమార్ నాగేంద్రని అడిగితే సమాధానమిస్తూ ‘ నాకు ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేదు. అలాగే నాకు సినిమాలంటే కూడా ఆసక్తి లేదు. కానీ హాలీవుడ్ మూవీ ‘టైటానిక్’ నా గమ్యాన్ని, దిశా నిర్దేశాన్ని మార్చింది. ఆ సినిమా స్క్రీన్ ప్లే, సీజీ వర్క్స్ నన్ను థ్రిల్ చేసాయి, అలాగే ఇంత బ్యూటిఫుల్ గా కూడా నేరేట్ చెయ్యొచ్చా అని ఆశర్యానికి గురయ్యాను. ఆ తర్వాతే ఇండస్ట్రీ వైపు అడుగులు వేశానని’ అన్నాడు.