బాక్స్ ఆఫీసు వద్ద ఫైట్ చేయనున్న ముగ్గురు లేడీస్.!

బాక్స్ ఆఫీసు వద్ద ఫైట్ చేయనున్న ముగ్గురు లేడీస్.!

Published on Mar 6, 2013 2:10 PM IST

Manchu-Lakshmi--Jhansi-Jeev

ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీసు వద్ద సినిమా నిర్మాతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. కొత్త సినిమాలు తీసి వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తారు. కానీ ఈ శుక్రవారం బాక్స్ ఆఫీసు వద్ద ఒక ఆసక్తికరమైన విచిత్రం జరగనుంది. మనందరికీ తెలిసిన ముగ్గురు లేడీస్ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ ముగ్గురు మరెవరో కాదు లక్ష్మీ మంచు, ఝాన్సీ, జీవిత రాజశేఖర్. లక్ష్మీ మంచు నటించి , నిర్మించిన సినిమా ‘గుండెల్లో గోదారి’ , ఝాన్సీ నిర్మించిన ‘అల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్విరిథింగ్’, జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో వహించిన ‘మహంకాళి’. ఈ మూడు సినిమాలు మార్చ్ 8న విడుదల కానున్నాయి. వారివారి విభాగాల్లో పేరు ప్రతిష్టలు సంపాదించిన ఈ ముగ్గురిలో ఈ శుక్రవారం బాక్స్ ఆఫీసు వద్ద విజేతలుగా ఎవరు నిలుస్తారో? వేచి చూడవలసిందే. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఎంతో ఫాషన్ తో ధైర్యంగా సినిమాలు చేస్తున్న ఈ ముగ్గురికీ గుడ్ లక్ చెబుతున్నాం.

తాజా వార్తలు