ఏప్రిల్ లో రానున్న రజినీకాంత్ కొచాడియాన్ ఆడియో

ఏప్రిల్ లో రానున్న రజినీకాంత్ కొచాడియాన్ ఆడియో

Published on Mar 1, 2013 8:00 AM IST

rajini_kanth_kochadaiyaan

సూపర్ స్టార్ రజినీకాంత్ భారీ బడ్జెట్ గ్రాఫికల్ మానియా ‘కొచాడియాన్’ సినిమా ప్రతుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. చెన్నైలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో ఏప్రిల్ లో విడుదల కానుంది. అలాగే ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చెయ్యాలని కూడా రజినీకాంత్ ఆలోచనలో ఉన్నారు. అత్యాధునిక టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ ‘అవతార్’ సినిమాకి పనిచేసిన స్టీరియో స్కోపిక్ టీం కూడా పనిచేస్తోంది.

దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, శోభన, జాకీ ష్రాఫ్, తదితర సీనియర్ నటులు నటిస్తున్నారు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. రజినీకాంత్ పెద్ద కుమార్తె సౌందర్య ఈ సినిమాకి డైరెక్టర్.

తాజా వార్తలు