ఏప్రిల్ నుండి రాజమౌళి ‘బాహుబలి’

ఏప్రిల్ నుండి రాజమౌళి ‘బాహుబలి’

Published on Feb 7, 2013 10:00 AM IST

Baahubali

అగ్ర దర్శకుడు రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ బాహుబలి ఏప్రిల్ నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం లొకేషన్ సెర్చ్ పనిలో ఉన్న చిత్ర టీం బిజీగా ఉంది. ఈగ తరువాత ఈ సినిమాని రాజమౌళి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో నిర్మించడానికి ప్లాన్ చేస్తుండగా దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ బాగా బరువు పెరిగే పనిలో ఉన్నాడు. బాహుబలి 2014లో విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు