ఐటెం సాంగ్స్ విషయాన్ని తెలుగు సినిమా సింపుల్ గా తీసుకుంటుందా?

ఐటెం సాంగ్స్ విషయాన్ని తెలుగు సినిమా సింపుల్ గా తీసుకుంటుందా?

Published on Feb 4, 2013 11:51 PM IST

Hot-5-Minutes

సెన్సార్ బోర్డ్ వారు సినిమాల్లో ఐటెం సాంగ్ ఉంటే దానికి ఎ సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయించింది. మీడియా ప్రతినిధుల మధ్య జరిగిన ఓ చర్చలో ఐటెం సాంగ్ యొక్క ఆవశ్యకత, ప్రాక్టికాలిటీ గురించి చర్చించారు. అలాగే ఐటెం సాంగ్స్ ని టీవీలలో వేయరాదు అనే కొత్త రూల్ ని కూడా పాస్ చేసారు. ఇప్పుడు అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న ఏమిటంటే తెలుగు సినిమా ఐటెం సాంగ్స్ విషయాన్ని సింపుల్ గా తీసుకుంటుందా? దీనివల్ల వచ్చే పరిణామాలు చాలా కీలకం కానున్నాయి.

సినిమాకి ఎ సర్టిఫికేట్ ఇస్తే ఓవర్సీస్, మల్టీప్లెక్సుల్లో ఆ సినిమా ఓపెనింగ్స్ కి దెబ్బపడే అవకాశం ఉంది. ఐటెం సాంగ్ అంత ప్రమాదమా?. ఈ విషయాన్ని పరిశీలించడానికి ఫిల్మ్ ఇండస్ట్రీ సభ్యులు ఓ కొత్త కమిటీని వేశారు. ‘ ఒక ఐటెం సాంగ్ అనేది ఇలా ఉండాలి అని ఎవరూ నిర్వచించలేదు. అలాగే ఒక రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ని, ఒక ఐటెం సాంగ్ ని సెన్సార్ బోర్డ్ ఎలా వేరు చేస్తుందని’ ఓ ప్రముఖ నిర్మాత అన్నారు.

ఈ సమస్య ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి?

తాజా వార్తలు