మొదలయిన గోపీచంద్, తాప్సీల చిత్ర చివరి షెడ్యూల్

మొదలయిన గోపీచంద్, తాప్సీల చిత్ర చివరి షెడ్యూల్

Published on Feb 3, 2013 4:38 AM IST

Gopichand-tapsee
మొదలయిన గోపీచంద్, తాప్సీల చిత్ర చివరి షెడ్యూల్

గోపీచంద్ రాబోతున్న యాక్షన్ అడ్వెంచర్ ఈరోజు హైదరాబాద్లో చివరి షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. పాటలు మినహా ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ మొత్తం పూర్తయిపోతుంది. గోపీచంద్ మరియు తాప్సీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్సకత్వం వహిస్తుండగా బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ మొదలు పెట్టుకొని దాదాపుగా సంవత్సరం దాటింది. లడఖ్ వంటి అందమయిన ప్రదేశాల్లో ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఒక సాధారణ వ్యక్తి నిధి వేటకి వెళ్లి అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది ఈ చిత్ర కథాంశం. ఈ చిత్రంలో చంద్ర శేఖర్ ఏలేటి భారీ ఎత్తున విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించినట్టు తెలుస్తుంది ఈ చిత్రం క్లైమాక్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అని చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రంలోని తారాగణం వివరాలు త్వరలో వెల్లడిస్తారు. శాందాత్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది.

తాజా వార్తలు