‘ఇప్పటివరకూ నా జీవితంలో సినిమాలు చూసిన తర్వాత ఇద్దరు హీరోయిన్స్ తో ప్రేమలో పడ్డాను. మొదటగా ‘క్షణ క్షణం’ సినిమా చూసిన తర్వాత శ్రీ దేవితో ప్రేమలో పడ్డాను, ఆ తర్వాత ‘ఏ మాయ చేసావే’ సినిమా చూసి సమంతతో ప్రేమలో పడ్డాను. ఆ సినిమాలో సమంత సూపర్బ్ గా ఉంటుందని’ జబర్దస్త్ ఆడియో వేడుకలో రానా అన్నాడు.
అలాగే సిద్దార్థ్ గురించి మాట్లాడుతూ ‘ సిద్దార్థ్ వయసు పెరుగుతున్నా ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నాడు. జబర్దస్త్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని’ అన్నాడు. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నిత్యా మీనన్, శ్రీహరి కీలక పాత్రలు పోషించారు.
ప్రస్తుతం రానా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బాహుబలి’ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకోసం నిన్నటి నుంచి రానా కట్టి ఫైట్స్ నేర్చు కుంటున్నాడు