లక్ష్మీ మంచుని నిరాశపరిచిన మణిరత్నం.!

లక్ష్మీ మంచుని నిరాశపరిచిన మణిరత్నం.!

Published on Feb 1, 2013 8:15 PM IST

Lakshmi-Manchu
సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం తీసిన తాజా చిత్రం ‘కడలి. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో లక్ష్మీ మంచు కాస్త నిరాశకి గురయ్యారు. ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్, తులసి, అరవింద్ స్వామి,అర్జున్ ప్రధాన పాత్రలు పోషించగా, లక్ష్మీ మంచు ఒక కీలక పాత్ర పోషించిది. గత కొన్ని నెలలుగా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఈ సినిమాలోని గుంజుకున్నా అనే పాటని లక్ష్మీ మంచు – అర్జున్ లపై షూట్ చేసారు.

ఈ పాట తమిళ వెర్షన్ ని ఎం టీవీలో ప్రత్యక్షంగా ఎ.ఆర్ రెహమాన్ ఆలపించినప్పటి నుంచి ఈ సాంగ్ పైనే అందరి చూపు. ఈ రోజు ఈ సినిమా చూసిన లక్ష్మీ మంచు షాక్ గురై ‘ నెంజికుల్లే సాంగ్ సినిమాలో లేకపోవడంతో షాక్ కి గురయ్యాను. కానీ మణి సార్ ఏదో ఒక కారణం వల్లనే తీసేసి ఉంటారు. అయినప్పటికీ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు హ్యాపీగా ఉంది. మిమ్మల్ని నిరాశాపరిచినందుకు ఏమీ అనుకోవద్దని’ ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

ఇది కాకుండా మంచు లక్ష్మీ నిర్మించిన ‘గుండెల్లో గోదారి’ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. కుమార్ నాగేందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించగా ఆది, తాప్సీ, లక్ష్మీ మంచు, సందీప్ కిషన్ కీలక పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు