యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాని తర్వాత ఇప్పుడు కామెడీ హీరో సునీల్ నందిని రెడ్డి డైరెక్షన్లో రానున్న ‘జబర్దస్త్’ సినిమాకి వాయిస్ ఓవర్ అందించాడు. సిద్దార్థ్, సమంత హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో నిత్యామీనన్ ఓ కీలక పాత్ర పోషించింది. ఈ రోజు జరిగిన జబర్దస్త్ ఆడియో వేడుకలో సునీల్ మాట్లాడుతూ ‘ ఈ సినిమాకి నేను వాయిస్ ఓవర్ అందించాను. ఈ సినిమాలో నేను కూడా ఒక భాగం అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ‘Mr పెళ్ళికొడుకు అనే ఒక క్లాస్ సినిమా తీశాను, సిద్దార్థ్ ఏమో ‘జబర్దస్త్’ అనే ఓ మాస్ సినిమా చేసాడు, ఏంటో అంతా రివర్స్ లో జరుగుతోంది. కానీ రెండు సినిమాలు విజయం సాదించాలని కోరుకుంటున్నానని’ అన్నాడు.
ప్రస్తుతం సునీల్ నటించిన ‘Mr పెళ్ళికొడుకు’ సినిమా రిలీజ్ కి సిద్దమవుతోంది. అది కాకుండా తమిళ సినిమా వేట్టై రీమేక్‌లో నటిస్తున్నాడు. అది కాకుండా త్వరలోనే మారుతి డైరెక్షన్లో సెట్స్ పైకి వెళ్ళే సినిమాలో నటించనున్నాడు.