కృష్ణ వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్??

కృష్ణ వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్??

Published on Feb 1, 2013 1:45 AM IST

Krishna-Vamshi-Allari-Nares
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ కామెడి హీరో అల్లరి నరేష్ కలిసి ఒక చిత్రం చెయ్యనున్నారు. ఈ చిత్రం దాదాపుగా ఖరారు అయిపోయింది ఈ చిత్రంలో కథానాయిక కోసం వెతుకుతున్నారు. కృష్ణ వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ కనిపించడం ఇది రెండవసారి గతంలో “డేంజర్” అనే చిత్రంలో అల్లరి నరేష్ నటించారు. ఈ కామెడీ చిత్రం ఈ ఏడాది మొదలు కానుంది. ప్రస్తుతం కృష్ణ వంశీ, నాని మరియు కేథరిన్ తెరెసా కలయికలో వస్తున్న “పైసా” చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. అనిల్ సుంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న “యాక్షన్ 3D” చిత్రీకరణలో అల్లరి నరేష్ బిజీ గా ఉన్నారు.

తాజా వార్తలు