కమల్ హాసన్ “విశ్వరూపం” చిత్రం మీద వచ్చిన నిరసనలు మరియు బ్యాన్ దేశం మొత్తాన్ని కదలించింది. బాలీవుడ్ నుండి ప్రధాన తారలు షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ వంటి వారు కమల్ కి సపోర్ట్ గా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం కూడా కమల్ హసన్ కె సపోర్ట్ చెయ్యడం ఈ విషయం మీద మరింత ఆసక్తి రేకెత్తేలా చేసింది. మనీష్ తివారి సెన్సార్ పూర్తయిన ఒక చిత్రాన్ని బ్యాన్ చేసే హక్కు రాష్ట్రాలకు లేదని అన్నారు. ఈ రోజు జరిగిన విలేఖరుల సమావేశంలో మనీష్ తివారి అన్న మాటల గురించి జయలలిత స్పందిస్తూ “సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఒక చిత్రాన్ని బ్యాన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మనీష్ తివారి అటువంటి విమర్శలు చేసేముందు ఒకసారి సరి చూసుకోవాలి” అని అన్నారు.
జయ లలిత ఇలాంటి స్టేట్మెంట్ చెయ్యగానే కేంద్రప్రభుత్వం సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ని ఒకసారి పునః పరిశీలించాలి అని నిర్ణయించుకుంది. ఈ యాక్ట్ ని 1952లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. “సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ని పునః పరిశీలించాల్సిన అవసరం ఎంతయినా ఉంది లేకపోతే ప్రతి రాష్ట్రం వాళ్ళిష్టం వచ్చినట్టు చిత్రాలను నిషేదిస్తారు” అని మనీష్ తివారి పేర్కొన్నారు. ఒకవేళ ఇది నిజంగానే జరిగితే చిత్ర విడుదలలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఎవరు ఈ చిత్రం మీద నిరసన వ్యక్తం చేస్తారా అన్న సమస్య నిర్మాతలకు దాదాపుగా తగ్గిపోతుంది. కాని ఇది నిజంగా త్వరలో జరగనుందా? అన్నదే అసలు ప్రశ్న.