నా కిక్ కోసం ఈ సినిమా తీశాను – బొమ్మరిల్లు భాస్కర్

నా కిక్ కోసం ఈ సినిమా తీశాను – బొమ్మరిల్లు భాస్కర్

Published on Jan 31, 2013 4:00 PM IST

bhaskar

ఎనర్జిటిక్ హీరో రామ్ – కృతి కర్బంధ జంటగా నటించిన సినిమా ‘ఒంగోలు గిత్త’. ఈ సినిమాకి క్లాస్ చిత్రాల దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా సినిమా విశేషాలు తెలుపడంకోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.

రామ్ మాట్లాడుతూ ‘ అందరూ ఈ సినిమా మొదలైనప్పటినుంచి నిన్న సెన్సార్ వారు ఇచ్చిన ఎ సర్టిఫికేట్ వరకూ ప్రతి విషయంలోనూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక అందరూ ఆశ్చర్య పడటం మానేసి సినిమా చూసి ఎంజాయ్ చెయ్యండి. ఇది అందరూ చూడదగ్గ సినిమా అని’ అన్నాడు.

కృతి కర్బంధ మాట్లాడుతూ ‘ సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అందరూ సినిమాకి వెళ్ళండి మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని’ చెప్పింది.

డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ ‘ నా కెరీర్లో పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఎంతో ప్రశాంతంగా సాగిన సినిమా ఇది. రామ్ పాత్ర, పెర్ఫార్మన్స్ రెండూ కొత్తగా ఉంటాయి. నా సినిమాల్లో ఉండే అన్ని అంశాలు ఈ సినిమాలో కూడా ఉంటాయి. నా ఇమేజ్ మార్చుకోవడానికి చేసిన సినేమా కాదిది, నా కిక్ కోసం ఈ సినిమా చేశాను. ఈ సారి నేను చేసే సినిమా అందరికన్నా నేను బాగా ఎంజాయ్ చెయ్యాలనే ఉద్దేశంతో ఈ సినిమా కథ రాసుకున్నాను. ఈ సినిమాకి మణిశర్మ రీ రికార్డింగ్ మెయిన్ హైలైట్, సినిమాకి నేను సగమైతే మణిశర్మ గారు సగం. రీ రికార్డింగ్ తర్వాతే సినిమాపై నాకు పూర్తి నమ్మకం వచ్చింది. మణిశర్మ గారికి కూడా సినిమా బాగా నచ్చడంతో ఆయనే స్వయంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ న్యూడ్ సీన్స్ వల్ల ఎ సర్టిఫికేట్ వచ్చింది ఆ సీన్స్ ని కూడా ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని’ అన్నాడు.

తాజా వార్తలు