ఒంగోలు గిత్త ఓవర్సీస్ ప్రింట్స్ స్టేటస్

ఒంగోలు గిత్త ఓవర్సీస్ ప్రింట్స్ స్టేటస్

Published on Jan 30, 2013 5:13 PM IST

Ongole-Gittha

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ‘ఒంగోలు గిత్త’ సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకి సంబందించిన ఓవర్సీస్ ప్రింట్స్ ఈ రోజు బయలుదేరనున్నాయి. ఈ సినిమాకి సంబందించిన 5 సాధారణ ప్రింట్స్, 35 డిజిటల్ ప్రింట్స్ ఈ రోజు రాత్రి ఎమిరేట్స్ ప్లైట్ లో యు.ఎస్ కి వెళ్లనున్నాయి. ప్రీమియర్ షో షెడ్యూల్స్ కూడా ఖరారయ్యాయి. అలాగే దుబాయ్ కి సంబంధించిన 2 సాధారణ, 5 డిజిటల్ ప్రింట్స్ మరియు యు.కె కి సంబందించిన 1 సాధారణ, 4 డిజిటల్ ప్రింట్స్ కూడా బయలుదేరాయి.

కృతి కర్బందా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్. సెన్సార్ బోర్డ్ నుంచి ఎ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాకి బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాకి ఓ పాట, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మణిశర్మ అందిస్తున్నాడు.

తాజా వార్తలు