విశ్వరూపం పై మళ్ళీ నిషేధం -సుప్రీం కోర్టును ఆశ్రయించిన కమల్

విశ్వరూపం పై మళ్ళీ నిషేధం -సుప్రీం కోర్టును ఆశ్రయించిన కమల్

Published on Jan 30, 2013 11:14 AM IST

vishwaroopam

అప్డేట్ 16:00 – విశ్వరూపం సినిమాని హై కోర్టు మళ్ళీ నిషేదించింది, అలాగే తుది తీర్పును ఫిబ్రవరి 6కి వాయిదా వేసింది. దీన్ని బట్టి చూస్తుంటే అప్పటివరకూ ఈ సినిమా ప్రదర్శన నిలిపివేస్తారని తెలుస్తోంది. దాంతో కమల్ హాసన్ సుప్రీం కోర్టులో అప్లై చెయ్యాలని నిర్ణయించుకున్నారు. సినీ అభిమానుల నుండి, ఫాన్స్ నుండి మరియు సినీ ప్రముఖుల నుంచి కమల్ కి సపోర్ట్ ఉంది.

లోకనాయకుడు కమల్ హాసన్ ‘విశ్వరూపం’ ఎంత వివాదాలు సృష్టించిందో అంత పాపులర్ అయింది. డీటీహెచ్ వివాదం మొదలుకొని ధియేటర్ యజమానుల వివాదం ఇలా ఎన్నో వివాదాల కేంద్ర బిందువైన విశ్వరూపం తమిళనాడులో తప్ప మిగతా అంతటా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. తెలుగు వెర్షన్ కి కూడా మంచి స్పందన లభిస్తోంది. అయితే విశ్వరూపం పార్ట్ కూడా ఉంటుందని చెప్పిన కమల్ పార్ట్ 2 కూడా దాదాపు పూర్తి కావచ్చిందని సమాచారం. కేవలం 25 నిమిషాల నిడివి షూట్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. బాలన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా పూర్తి చేసి త్వరలో రిలీజ్ చేస్తానని కమల్ చెప్పారు. పార్ట్ 2 ఇండియాలో ఉంటుందని కమల్ అన్నారు.

తాజా వార్తలు