అందానికి అందం, అభినయానికి అభినయం కలగలిపిన అందాల భామ శ్రుతి హాసన్ ఈ రోజు తన 26 వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఫేమస్ హీరో కమలహాసన్ – సారిక దంపతులకు జన్మించిన శృతి చిన్నతనం అంతా చెన్నైలో గడిచింది. చిన్నప్పుడు కమల్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడపాదడపా కనిపించిన శృతి ముంబైలో సైకాలజీలో పట్టా అందుకుంది. ఆ తర్వాత కాలిఫోర్నియాలో మ్యూజిక్ నేర్చుకుంది. మొదట బాలీవుడ్లో లక్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న శృతి కి ఆ లక్ అంతగా కలిసి రాలేదు.
ఆ తరవాత తెలుగు – తమిళ చిత్రసీమలఫై దృష్టి పెట్టిన శృతి ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెలుగు వారికి పరిచయమై ‘గబ్బర్ సింగ్ సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమాతో శ్రుతి దశ తిరిగింది. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఈ భామ ప్రస్తుతం ‘బలుపు’, ‘ఎవడు’, అలాగే ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో రానున్న సినిమాల్లో నటిస్తోంది. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ కి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.