‘ఋషి’, ‘ఇట్స్ మై లవ్ స్టొరీ’ సినిమాల ద్వారా పరిచయమైన అరవింద్ కృష్ణ ‘బిస్కెట్’ అనే మరో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో మళ్ళీ మనముందుకు రానున్నాడు. అనీల్ గోపిరెడ్డి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా ద్వారా సిమ్రాన్ సురి హీరోయిన్ గా పరిచయమవుతోంది. వెన్నెల కిషోర్ ఓ కీలక పాత్రలో నటించనున్న ఈ సినిమా ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచనంగా ప్రారంభమైంది. చిరు క్లాప్ ఇవ్వగా అరవింద్ – వెన్నెల కిషోర్ లపై తొలి షాట్ ను తీసారు. ఈ చిత్ర పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.
ప్రస్తుతం అరవింద్ కృష్ణ ఈ సినిమా కాకుండా ‘ఎంప్టీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. హర్షథ్ విధేయ ఈ సినిమాకి డైరెక్టర్.